RTE 2009

ఉచిత, నిర్భంధ ప్రాథమిక విద్యకు బాలల హక్కు చట్టం – 2009

The Right of Children to Free and Computlosry Education Act 2009

               

6 నుండి 1-14  సంవత్సరముల పిల్లలందరు బడిలో చేరి, ఉచితంగా  చదువుకోవడానికి  ఉద్దేశించిన చట్టం  ఉచిత, నిర్భంధ విద్య బాలల హక్కు చట్టం,2009 దీనిని ఆగష్టు 27 వ తేదిన పార్లమెంటు ఆమోదించింది.

ఈ చట్టంలోని ముఖ్యాంశాలు:

  • పాఠశాలకు మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించాలి.
  •  పిల్లలను బడిలో చేర్చడం  తల్లిదండ్రుల బాధ్యత.
  • బడిలో ప్రవేశానికి ఎంపిక విధానం, క్యాంపిటేషన్ రుసుం ఉండదు.
  • బడిలో చేరిన పిల్లల పేరు తీసివేయడం, ఆదే తరగతిలో కొనసాగించడం నిషేధం.
  • పిల్లల్ని  శారీరకంగా, మానసికంగా వేదించడం నిషేధం
  • వయస్సు నిర్ధారణ పత్రం , ఇతర ధృవీకరణ పత్రాలు లేవనే  కారణం చేత పిల్లలకు బడిలో ప్రవేశాన్ని  నిరాకరించరాదు.
  • గుర్తింపు  లేకుండా పాఠశాలలు ప్రారంభించరాదు. ప్రారంభిస్తే  రూ.లక్ష జరిమానా విధించవచ్చు.
  • అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో  పాఠశాల యాజమాన్య కమిటీని ఏర్పాటు చేయాలి.
  • నిర్ధారిత అర్హతలున్న  వారిని మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి.
  • పిల్లల సర్వతోముఖాభివృద్ధి జరిగేలా బోధనాభ్యసనం, మూల్యాంకనం  ఉండాలి.
  • ఉపాధ్యాయులు ప్రైవేటు ట్యూషన్లు, ప్రైవేటు బోధనా పనులు నిర్వహించరాదు.
  • నిర్ణీత స:క్యలో ఉపాధ్యాయుల పోస్టులను, అవసరమైన తరగతి గదులను మంజూరుచేయాలి.
  • ఎలిమెంటరీ విద్య పూర్తయ్యేవరకు బోర్డు పరీక్షలు  ఉండవు.
  • ఎయిడెడ్, ఆన్- ఎయిడెడ్ పాఠశాలలు కనీసం 25 శాతం వరకు ప్రతి సంవత్సరం  1వ తరగతిలో  పేద పిల్లలను చేర్చుకోవాలి. వీరి ఫీజుల ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుంది.

బాలల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం :  బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ లేదా విద్యా హక్కు రక్షణ సంస్థ (REPA) ను ఏర్పాటు చేయాలి.