వివిధ గ్రాంటులు

 

బోధనాభ్యసన పరికరాల గ్రాంటు

నూతన ప్రాథమిక/ ప్రాథమికోన్నత పాఠశాలలకు బోధనాభ్యసన పరికరాల గ్రాంటు (T.L.E)

            బోధనాభ్యసన పరికరాల (టి.ఎల్.ఇ) కొనుగోలుకు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతి ప్రాథమిక పాఠశాలకు రూ.20,000/-  మరియు ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.50,000/- చొప్పున నిధులు కేటాయించబడును.

          ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి ప్రారంభిస్తే అదనంగా రూ.15,000/- టి.ఎల్.ఇ కింద మంజూరు చేస్తారు.

          ఈ విద్యా సంవత్సరంలో 20 ప్రాథమిక పాఠశాలలకు 5 ప్రాథమికోన్నత పాఠశాలలకు బోధనాభ్యసన పరికరాల గ్రాంటు మంజూరైనది.

 

ఇతర గ్రాంటులు

మండల రిసోర్స్ కేంద్రాల గ్రాంటు

            ప్రతి సంవత్సరం వివిధ విద్యా కార్యక్రమాల నిర్వహణకు మండల రిసోర్స్ కేంద్రానికి రూ.90,000/- అందజేస్తారు.

ఈ విద్యా సంవత్సరంలో 1137 మండల రిసోర్స్ కేంద్రాలకు గ్రాంటు మంజూరైనది.

పాఠశాల సముదాయాల గ్రాంటు

            వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రతి పాఠశాల సముదాయానికి రూ.25,000/- ప్రతి సంవత్సరం అందజేస్తారు.

          ఈ విద్యా సంవత్సరంలో 6973 సముదాయాలకు గ్రాంటు మంజూరైనది.

పాఠశాల గ్రాంటు

          ప్రతి ప్రాథమిక పాఠశాలకు రూ. 5,000/- మరియు ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.7,000/-పాఠశాల గ్రాంటు ఇస్తారు. ఈ గ్రాంటులో పాఠశాలకు అవసరమైన వస్తువులు, పరికరాలు, గ్రంథాలయ పుస్తకాలు కొనుక్కోవచ్చు.

          ఈ విద్యా సంవత్సరం  69464 ప్రాథమిక పాఠశాలలకు, 20981 ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.4941.87 లక్షలు మంజూరైనవి.

పాఠశాల నిర్వహణ గ్రాంటు

            3 గదుల వరకు గల పాఠశాలకు రూ.5,000/- లు, 4 మరియు అంతకంటే ఎక్కవ గదులు గల పాఠశాలకు రూ.10,000/- లు ప్రతి సంవత్సరం నిర్వహణ గ్రాంటు అందజేయబడును. మండల వనరుల కేంద్రాలు, పాఠశాల సముదాయాలకు రూ.10,000/- మరియు రూ.2,000/- చొప్పున మంజూరు చేయబడును.

          ఈ విద్యా సంవ్సరం 73324 ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.4597.94 లక్షలు మంజూరైనవి.

 

ఉపాధ్యాయ గ్రాంటు

          ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ప్రతి ఉపాధ్యాయునికి రూ.500/- చొప్పున ఉపాధ్యాయ గ్రాంటు  ఇస్తారు.

          పాఠశాలకు విడుదలైన అన్ని రకాల నిధులను పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశంలో  చర్చించి, తీర్మానాలు చేసి ఖర్చు చేయాలి.

          ఈ విద్యా సంవత్సరంలో 152858 మంది  ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులకు, 82627 మంది ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మొత్తం రూ.1177.43 లక్షలు మంజూరైనవి..