యంత్రాంగము

సర్వ శిక్షా అభియాన్  కార్యక్రమ అమలుకు వివిధ స్ధాయిలలో యంత్రాంగాలను ఏర్పాటు చేయడం జరిగినది.

 

జాతీయ స్దాయిలో:

ప్రధానమంత్రి అధ్యక్షులుగా, మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రివర్యులు ఉపాధ్యక్షులుగా జాతీయ ఎలిమెటరీ విద్యామిషన్ (National Elementary Education Mission (NEEM)) ఏర్పాటు  చేయబడినది.దీనికి అధిపతిగా అదనపు కార్యదర్శి వ్యవహరిస్తారు. 

ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. అవి

  1. జనరల్ కౌన్సిల్ - జనరల్ కౌన్సిల్ కి ప్రధానమంత్రి అధ్యక్షులుగా మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి  ఉపాధ్యక్షులుగా ఉంటారు
  2. కార్యనిర్వాహక  కమిటీ. - మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి  అధ్యక్షులుగా, ఎలిమెటరీ విద్యా  శాఖా కార్యదర్శి ఉపాధ్యక్షులుగా ఉంటారు.

    ఈ మిషన్ తో పాటు  విద్యా విషయక, సాంకేతిక సహాయం కోసం  National  Council of Education  Research and Training (NCERT), National  University of Educational Planning & Administration (NUEPA), National  Council of Teacher Education (NCTE)& Educational Consultants of India  Limited (EDCIL) ఉంటాయి.

 

రాష్ట్ర స్థాయి లో  :

మన రాష్ట్రంలో  సర్వశిక్షా అభియాన్ కార్యక్రమాలు రాజీవ్ విద్యామిషన్ (RVM) సొసైటీ ద్వారా అమలుపరచబడుతున్నాయి. ఇందులో రెండు విభాగాలుంటాయి.

  1. జనరల్ కౌన్సిల్ : రాష్ట్ర  ముఖ్యమంత్రి అధ్యక్షులుగా, సర్వశిక్షా అభియాన్ మంత్రి  ఉపాధ్యక్షులుగా  ఉంటారు. వీటితో  పాటు  వివిధ శాఖల మంత్రులు/శాఖాధిపతులులు, , NGOలు, విద్యావేత్తలు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీ సర్వశిక్షా అభియాన్ లక్ష్యాలను సాధించడానికి అవసరమయ్యే సలహాలను, సూచనలను ఇస్తుంది. అమలవుతున్న కార్యక్రమాలను సమీక్షిస్తుంది.
  2. కార్యనిర్వహక కమిటీ: -   ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షులుగా, సర్వశిక్షా అభియాన్ ముఖ్య కార్యదర్శి ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. రాజీవ్ విద్యామిషన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ సభ్య కార్యదర్శిగా వ్వవహరిస్తారు. ఈ కమిటీలో సభ్యులుగా వివిధ శాఖల కార్యదర్శులు, NGOలు విద్యావేత్తులు, జిల్లా విద్యాశాఖాధికారులు, ప్రాజెక్టు అధికారులు ఉంటారు.   ఈ కమిటీ రాజీవ్ విద్యామిషన్ నియమాలకు అనుగుణంగా లక్ష్యాల సాధన కొరకు పరిపాలనాపరమైన, ఆర్ధిక పరమైన , విద్యా పరమైన కార్యక్రమాల సక్రమ నిర్వహణ బాధ్యత వహిస్తూ జిల్లాల్లో కార్యక్రమాల అమలును  పర్యవేక్షిస్తుంది.

        రాష్ట్రస్దాయిలో ప్రాజెక్టు  డైరెక్టరు అధిపతిగా  సర్వశిక్షా అభియాన్ కార్య క్రమాలు  నిర్వహించబడుతాయి . వీటిని  నిర్వహించడానికి వివిధ విభాగాధిపతులు ఉంటారు. వీరు జిల్లా స్ధాయిలో కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ సక్రమ అమలు కొరకు సలహాలు  సూచనలు ఇస్తారు.

జిల్లా స్ధాయిలో: 

 జిల్లా ప్రాజెక్టు కార్యాలయం ద్వారా కార్యక్రమాలు అమలు చేయబడును. జిల్లా కలెక్టరు గారు అధ్యక్షులుగా ఉండి ప్రాజెక్టు అధికారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించబడును. ఉపాధ్యాయ  శిక్షణ, బడిబయటి పిల్లలు, సామాజిక చైతన్యం, బాలికల విద్య సివిల్  పనులు మరియు అకౌంట్స్ నిర్వహణ విభాగాల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

            సర్వశిక్షా అభియాన్ లక్ష్యాల  సాధనకు కార్యక్రమాల అమలుకు, వాటి పర్యవేక్షణకు జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో జిల్లా స్ధాయిలో కమిటీ పని చేస్తుంది. ఈ కమిటీ ప్రతి 3 నెలల కొకసారి  సమావేశమై కార్యక్రమ నిర్వహణను, లక్ష్యా సాధనను సమీక్షించి అవసరమైన సలహాలనిస్తుంది.

ఈ కమిటీలో  తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి 

·         జిల్లా ఇన్ ఛార్జి మంత్రి  -    శ్రీ                            అధ్యక్షులు

·         జిల్లా పరిషత్ అధ్యక్షులు  -శ్రీ                             సహాధ్యక్షులు

·         జిల్లా కలెక్టర్  -               శ్రీ                              ఉపాధ్యక్షులు

·         జిల్లాలోని  పార్లమెంటు సభ్యులు  -  సభ్యులు

·         జిల్లాలోని శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు   సభ్యులు

·         ప్రాంతీయ  సంయుక్త  సంచాలకులు, పాఠశాల విద్య- సభ్యులు

·         జిల్లా పరిషత్  ముఖ్య కార్యనిర్వహణాధికారి -  సభ్యులు

·         జిల్లా విద్యాశాఖాధికారి- సభ్యులు

·         అందరు ZPTC లు - సభ్యులు

·         సూపరింటెండెంట్ ఇంజనీర్, RWS  - సభ్యులు

·         ప్రాంతీయ డైరెక్టర్ (స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ)- సభ్యులు

·         సహాయ కమీషనర్ (కార్మిక శాఖ)- సభ్యులు

·         ఇద్దరు NGO లు (Nominated by Dist. Collector)- సభ్యులు

·         ప్రాజెక్టు అధికారి -    సభ్య కార్యదర్శిగా ఉంటారు.

 

మండల స్ధాయిలో:

         మండల స్ధాయిలో కార్యక్రమాలు మండల విద్యా వనరుల కేంద్రం (MRC)  ద్వారా మండల విద్యాధికారి ఆద్వర్యంలో  నిర్వహిస్తారు.  వీరికి  సహాయంగా ముగ్గురు మండల రిసోర్సు పర్పన్స్ (MRPs)  ఇద్దరు ప్రత్యేకావసరాల పిల్లల కొరకు రిసోర్సు పర్పన్స్ ఉంటారు. వీరి ఉపాధ్యాయులకు కావలసిన  విద్యావిషయక సాంకేతి సహాయాన్ని అందిస్తూ సర్వశిక్షా అభియాన్ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తారు.

        ప్రతి మండలంలోని 8-10 పాఠశాలలను కలసి ఒక పాఠశాల సముదాయంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధాన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కార్యదర్శిగా  ఉంటారు. అనుబంధ  పాఠశాలల్లోని  ఏదేని  ఒక  పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సహాయ కార్యదర్శిగా ఉంటారు. పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయులు  ప్రతినెలా పాఠశాలలను సందర్శించి , నెలవారీ సమావేశాలలో పాఠశాల కార్యక్రమాలన్నింటిని సమీక్షిస్తారు.

   

గ్రామ స్ధాయిలో:

 

         

గ్రామ స్ధాయిలో పాఠశాల యాజమాన్ని కమిటీ ఆ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఏర్పడి, 

సర్వశిక్షా అభియాన్ కార్యక్రమాల అమలు, నిర్వహణను పర్యవేక్షిస్తుంది. దీనికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్వీనర్  ఉంటారు.