బడి బయటి పిల్లలు

 

బడి బయటి పిల్లలు

 బడిబయటి పిల్లలకు విద్యావకాశాలు

            ఉచిత  నిర్భంధ విద్యా హక్కు చట్టం 2009 అమలులో భాగంగా బడిబయటి  పిల్లలందరినీ వారి వయస్సుకు తగిన తరగతిలో చేర్చవలసి ఉంటుంది. చేరిన తరగతి  స్ధాయికి  చెందిన అభ్యసన స్ధాయిలను  విద్యార్ధులకు అందించుటకు NRSTC (Non- residential Special Training Centers) లు , RSTC (Residential Special Training Centers) లు ఏర్పాటు చేస్తారు. అలాగే తల్లిదండ్రులతో పాటు  వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిన  పిల్లలకు విద్యను అందించుటకు పెద్దలు పనిచేస్తున్న ప్రాంతంలోనే Worksites Schools ఏర్పాటు చేస్తారు.

          ఈ విద్యా సంవత్సరంలో 274473 బడిబయటి పిల్లల కోసం రూ.8280.68 లక్షలు మంజూరైనవి.

Transit Homes

                వీధి బాలల, అనాధ బాలలు, తల్లిదండ్రుల నిరాదరణకు గురైన పిల్లలు మరియు ప్రత్యేక  పరిస్థితుల్లోనున్న పిల్లలకు విద్యావకాశాలు అందించుటకై Transit Homes  ఏర్పాటు చేయబడ్డాయి . ఇటువంటి పిల్లలను నేరుగా  రెగ్యులర్  పాఠశాలల్లో చేర్పించితే సర్దుబాటు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి , ఈ పిల్లలను కొంతకాలం Transit Homes  లో ఉంచి, వాలంటీర్ల ద్వారా కొద్ది రోజుల పాటు కౌన్సిలింగ్ ఇప్పించి తదుపరి రెగ్యులర్ పాఠశాలల్లో చేర్పించడం జరుగుతుంది.

మదర్సాలు

            మదర్సాలలో చదివే పిల్లలకు మత విద్యతో పాటు నియత విద్య కూడా బోధించుటకు తగు సహకారం అందించబడును. ఇందులో భాగంగా బోధనాభ్యనన సామాగ్రి  అందజేసి, ప్రతి 20 మంది పిల్లలకు ఒక వాలంటీరు నియమించబడును.

Child Rights Cell

                పిల్లల హక్కుల పరిరక్షణకు మరియు పిల్లలను బడిలో చేర్చి వారి విద్యను  కొనసాగించుటకు రాజీవ్ విద్యామిషన్ రాష్ట్ర కార్యాలయంలో Child Rights Cell  ఏర్పాటు చేయబడినది. తల్లిదంద్రులు గాని, సమాజ సభ్యులు గాని, విద్యాభివృద్ధిలో భాగస్వామ్యులైన వారెవరైన గాని 18004253525 నంబరుకు ఫోన్ చేసి సంప్రదించవచ్చును.

యూనిఫామ్స్

          1 నుండి 8 వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలందరికి  మరియు SC, ST  బాలురతో పాటు BC, OC లకు చెందిన BPL  కుటుంబాల బాలురకు యూనిఫామ్స్  అందజేయడం  జరుగును.

          ఈ విద్యా సంవత్సరం 5266837 మంది పిల్లల యూనిఫామ్ ల కొరకు రూ.21067.35 లక్షలు మంజూరైనవి.

రవాణా సౌకర్యం

            పాఠశాలలు ఏర్పాటు చేయడానికి వీలుగాని ప్రాంతాలలో తక్కువ జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ఉండే వారికి, పట్టణ మురికివాడల్లో ఉండే అనాథ పిల్లలకు మరియు పాఠశాల ఏర్పాటు చేయడానికి స్థలవసతి లేని ప్రాంతాల్లో ఉండే  పిల్లల కొరకు దగ్గరలో పాఠశాలలు లేకుంటే సమీప ప్రాంత పాఠశాలకు వెళ్ళడానికి రవాణా సౌకర్యం కల్పిస్తారు.

రెసిడెన్షియల్ పాఠశాలలు

            జనసాంద్రత తక్కువగా (చ.కి.మీ.కు 20 కంటే తక్కవ) ఉండే ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, దట్టమైన అడవి ప్రాంతాల్లో ఉండే పిల్లలకు మరియు పట్టణ వాడల్లోని పిల్లలకు, అనాథ పిల్లలు మరియు  వీధి  బాలల కోసం ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తారు.

          ఈ విద్యా సంవత్సరంలో ఖమ్మం, కృష్ణ (విజయవాడ) హైదరాబాద్ మరియు విశాఖపట్నం జిల్లాలలో మొత్తం 4 రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం కోసం రూ.74.88 లక్షలు మంజూరైనవి.