బాలికా విద్యాకార్యక్రమం NPEGEL

ఎలిమెంటరీ స్థాయి జాతీయ బాలికల విద్యా కార్యక్రమము (NPEGEL)

                బాలబాలికల మధ్య  లింగవివక్షత, నమోదు, నిలకడలలో వ్యత్యాసాన్ని తగ్గించి, బాలికల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంపొందించడం ద్వారా సాధికారత కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగుతుంది.

మన రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని విద్యా విషయకంగా వెనుకబడిన మండలాల్లో (మహిళా అక్షరాస్యతా శాతం  45.13% కంటే తక్కువ మరియు స్త్రీ పురుష అక్షరాస్యతల మధ్య వ్యత్యాసం 21.59%  కంటే ఎక్కువగా ఉన్న 5765 మోడల్ క్లస్టర్స్ పాఠశాలల్లో అమలు జరుగుతున్నది.

          ఇందులో భాగంగా పాఠశాలల్లో బాలికల కొరకు స్నేహపూరిత వాతారణం కల్పించడం , వృత్తి  విద్యా నైపుణ్యాలను కల్పించడం, నాణ్యమైన జీవనాన్ని  గడిపేందుకు కావలసిన జీవననైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుంది.

          NPEGEL  కార్యక్రమాల నిర్వహణ కొరకు రికరింగ్  గ్రాంటు క్రింద ప్రతి సంవత్సరము ప్రతి మోడల్ క్లస్టర్ పాఠశాలకు రూ.62,700 లు విడుదల చేస్తారు.

          ఈ విద్యా సంవత్సరంలో 5765 క్లస్టర్లకు రూ. 3614.66 లక్షలు మంజూరైనవి.

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (KGBV)

                 విద్యాపరంగా  వెనకబడిన మండలాలలో బాలికల విద్యాభివృద్ధి కొరకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం  మన  రాష్ట్రంలో 395 విద్యాలయాలు పనిచేస్తున్నాయి. సప్లిమెంటరీ బడ్జెట్ 2011-11 లో మరో 348 విద్యాలయాల ఏర్పాటుకు అనుమతించారు.

          ఈ విద్యా సంవత్సరంలో 743 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు రూ. 14963.90 లక్షలు మంజూరైనవి.

 

.స్తూరిబా గాంధి బాలికా విద్యాలయాలు.

NPEGEL:

బాలికా విద్యను పెంచుటకై జిల్లాలో 11 మండలాలు 70 క్లస్టర్లలో NPEGEL ను అమలు చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి రికరింగ్ ఖర్చు రూ 31.28 లక్షలు.ఈ కార్యక్రమంలో భాగంగా 7,8 తరగతులలో చదివే 53,280 మంది బాలికలకు శానిటరి నాప్ కిన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందుకై రూ 11.80 లక్షలు ఖర్చు చేయడమైనది.

 

కస్తూరిబా గాంధి బాలికా విద్యాలయాలు.

జిల్లాలో  8 కె.జి.బి.వి.  లు కలవు. ఈ విద్యాలయాలకు శాశ్వత నిర్మాణాలకై రూ 9 కోట్లు కేటాయించడ మైనది. గత సంవత్సరం 530 మంది తో ఈ విద్యాలయాలు నడుస్తున్నాయి. ఈ సంవత్సరం   మండల స్థాయిలో జరిపిన సర్వే లో గుర్తించిన సుమారు 600 మంది విద్యార్థినులను ఈ కేంద్రాలలో చేర్పించడం జరుగుతుంది.