ప్రత్యేక అవసరాలు గల పిల్లలు

 జిల్లా లో గుర్తించబడిన 12,098  ప్రత్యేక అవసరాలు గల పిల్లలకై రూ  3.604 కోట్లను కేటాయించడమైనది. వీరికై ఈ క్రింది కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది.

1.    చెవిటి విద్యార్థులకు అవసరమైన యంత్రాలు, అవసమైన వారికి మూడు చక్రాల సైకిల్లు, చక్రాల కుర్చీలు తదితరములను ఏర్పాటు చేయుట.  ఈ సంవత్సరం నేటి వరకు 510 మందికి చెవిటి యంత్రాలు, 233 మందికి వీల్ చైర్లు, 14 మందికి మూడు చక్రాల సైకిళ్ళ ను పంపిణీ చేయడమైనది.  

2.    పాఠశాలకు రాలేని విద్యార్థులకు ఇంటి వద్దనే అవసరమైన విద్య నేర్పుటకు 120  మంది బోధకుల  నియామకం. ప్రస్తుతం 69 మంది పనిచేయుచున్నారు. వీరు 388 మందికి ఇంటివద్దనే అవసరమైన విద్య నేర్పుచున్నారు.

3.    ప్రత్యేక అవసరాలు గల పిల్లలకై  ఫిజియో తెరపిస్ట్ లను  మండలానికొక్కరిని చొప్పున నియమించడం జరుగుతున్నది. వీరు 1011 మంది పిల్లల కు ఫిజియో థెరపీ లో అవసరమైన శిక్షణ నీయడమగుచున్నది.

4.    మండల స్థాయిలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు అవసరమైన శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయుట.