గుణాత్మక విద్య

గుణాత్మక విద్య(Quality Education )

            పిల్లలకు గుణాత్మక విద్యనందించడానికి కింద కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

అభ్యసనాభివృద్ధి కార్యక్రమం (Learning Enhancement Program me)

                పిల్లల్లో కనీసం సామర్థ్యాలైన చదవడం, రాయడం, గణిత ప్రక్రియలు చేయడంలో నైపుణ్యం పెంపొందించడానికి అభ్యసనాభివృద్ధి కార్యక్రమం అమలు చేయబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల సామర్థ్యాలను నాలుగుసార్లు అనగా సంవత్సరారంభం, త్రైమాసిక, అర్ధ సంవత్సరం, సంవత్సరాంతం వెనుకబడిన విద్యార్థులలో సామర్థ్యాల పెంపునకు వినూత్మ బోధనావిధానాలు అమలుపరచబడును.

          ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 23 జిల్లాలకు రూ.1738.41 లక్షలు మంజూరైనవి.

స్నేహబాల కార్యక్రమం

            కనీస సామర్థ్యాలు సాథించడానికి 1 నుండి 3 తరగతుల వరకు తెలుగు, గణితం, పరిసరాల విజానం  విషయాలకు సంబంధించి స్నేహబాల కార్డులను రూపొందించడం  జరిగింది. ఈ కార్డులలో పాఠ్యపుస్తకాలలోని పాఠ్యాంశాల ఆధారంగా పిల్లల స్ధాయికి తగిన కృత్యాలు ఉన్నాయి.

 

పాఠశాలల నిర్వహణ – నక్షత్రాల గ్రేడింగ్

          పాఠశాల నిర్వహణ మరియు పాఠశాలలో అమలుపరిచే కార్యక్రమాలు, ప్రక్రియలపైననే పాఠశాల ఫలితాలు ఆధారపడి ఉంటారు. వీటిలో ముఖ్యంగా అకడమిక్ మానటరింగ్ కమిటీ సమావేశాలు, బోధనాభ్యసన ప్రక్రియలు, పాఠశాల- ఉపాధ్యాయుల పనితీరు మరియు మూల్యాంకన విధానాలకు సంబంధించి 25 అంశాల సూచికలు తయారుచేయబడ్డాయి. వీటి ఆధారంగా పాఠశాలలకు నక్షత్రాల గ్రేడింగ్ ఇవ్వడం  జరుగుతుంది.

 

పరిశోధన, మూల్యాంకనం మరియు పర్యవేక్షణ 

          ప్రతి ప్రథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో బోధనాభ్యసన, డ్రాపౌట్స్, గుణాత్మక విద్య మొదలగు సమస్యలపై పరిశోధన అంశాలు గుర్తించి పరిశోధనలు నిర్వహిస్తారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఏర్పడ్డ మానటరింగ్ కమిటీలు RVM  కార్యక్రమాలను, పాఠశాలలను పర్యవేక్షిస్తాయి.

          ఈ విద్యా సంవత్సరంలో 90445 పాఠశాలలకు రూ.1175.78లక్షలు మంజూరైనవి.

వినూత్న  కార్యక్రమాలు

            వినూత్న  కార్యక్రమాల నిర్వహణకు ప్రతి జిల్లాకు సంవత్సరానికి కోటి రూపాయలు మంజూరు చేస్తారు. ఇందులో రూ.50 లక్షలు కంప్యూటర్ విద్యకు, మిగిలిన రూ.50 లక్షలు ఇతర కార్యక్రమాలైన పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలు (ECE)  బాలికల విద్య, మైనారిటీ విద్య , SC/ST  విద్య, పట్టణ ప్రాంత అణగారిన పిల్లల విద్య (Education of Urban Deprived Children )  అమలుకు వినియోగించబడును.