కార్యక్రమాల అమలు- ప్ర ణా ళి క

రాజీవ్ విద్యామిషన్ ద్వారా వివిధ కార్యక్రమాల అమలుకు కావలసిన నిధులను పొందడానికి ముందుగా వివిధ స్ధాయిలో ప్రణాళికలను రూపొందిస్తరు. గ్రామ విద్యావసరాలను గుర్తించి కావలసిన నిధులను గ్రామస్ధాయి ప్రణాళికల్లో పొందుపరుస్తారు. ఈ ప్రణాళికలు గ్రామ స్ధాయి నుండి మొదలై మండల, జిల్లా మరియు రాష్ట్రస్ధాయి వరకు ప్రజల భాగస్వామ్యంతో రూపొందించి భారత ప్రభుత్వ ఆమోదం కొరకు పంపిస్తారు.  భారత ప్రభుత్వ Project Approval Board ప్రణాళికలను ఆమోదిస్తుంది.   జిల్లా ప్రణాళికలను ఆధారంగా చేసుకొని ఆయా జిల్లాలకు అవసరమైన నిధులు దశల వారీగా విడుదల  చేయబడతాయి. అక్కడ నుండి నేరుగా పాఠశాలలకు, పాఠశాల సముదాయం (CRC) లకు మండల వనరుల కేంద్రా (MRC) లకు నిధుల పంపిణీ జరుగుతుంది.