GMAPS (పాఠశాలల ఆచ్చాదన)

భౌగోళిక సమాచార వ్యవస్థలో పాఠశాలల ఆచ్ఛాదన

(Geospatial Mapping of Andhra Pradesh Schools-GMAPS)

                 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వేతర యాజమాన్య పాఠశాలల వివరములను తెలుసుకొనుటకు (GMAPS-GIS)  భౌగోళిక సమాచార వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వ్యవస్థ ద్వారా పాఠశాలల యొక్క భౌగోళిక సమాచారముతో పాటు పాఠశాలలోని ఉపాధ్యాయుల, విద్యార్థుల వివరాలు, వసతులు మొదలగు మౌలిక సదుపాయాలను ఛాయాచిత్రము (Photo)  ల ద్వారా  తెలుసుకొనవచ్చును. అదే విధంగా వివిధ ఆవాస ప్రాంతాలు, పాఠశాలల మధ్య దూరాలను  తెలసుకోవచ్చును. ఈ వ్యవస్థ ద్వారా కొత్త పాఠశాలల అవసరాలను గుర్తించవచ్చును. ఈ వినూత్మ ప్రయోగమును భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో రాజీవ్ విద్యామిషన్  (SSA)  మరియు క National Centers (NIC) ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా నిర్వహించి అంతర్జాలంలో (internet)  సమాచారాన్ని పొందుపరచడమైనది. దీనిని http://gmapsrvm.ap.nic.in ద్వారా ఎవరైనను ఇంటర్నెట్ నుండి సందర్శించవచ్చును.